![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -725 లో......సూరజ్ కి మాలిని తన రెస్టారెంట్ కి రమ్మని ఆఫర్ ఇస్తుంది. దాంతో తను రిజెక్ట్ చేస్తాడు. అదంతా శివన్నారాయణ వాళ్ళు విని శభాష్ సూరజ్ అని మెచ్చుకుంటాడు. ఏంటి బాబాయ్ అక్కడ ఉండి చూస్తున్నారని మాలిని అంటుంది. నీ బేరసారాలు చూస్తున్నానని శివన్నారాయణ అంటాడు. అవకాశం మనది అవసరం వాళ్ళది అని మాలిని అంటుంది. అలా డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు నా దగ్గర ఉండరని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత పోటీ దగ్గరికి ఇరు రెస్టారెంట్ ల వాళ్ళు లోపలికి వెళ్తారు. జ్యోత్స్న రెస్టారెంట్ చెఫ్ వెళ్లి, DM రెస్టారెంట్ వాళ్ళ దగ్గర నిల్చొని ఉంటాడు. ఏంటి కిరణ్ అక్కడ నిల్చొని ఉన్నావని దీప అడుగుతుంది. అతను మా రెస్టారెంట్ తరుపున వంట చేస్తున్నాడని మాలిని అనగానే అందరు షాక్ అవుతారు. ఇంతకు దిగజారి మరి ప్రవర్తిస్తారా అని శివన్నారాయణ అంటాడు. ఏం జరిగింది మాలిని.. వాళ్ళ చెఫ్ మన దగ్గరికి ఎందుకు వచ్చాడని దక్షిణామూర్తి అడుగుతాడు. అతనే కాల్ చేసాడు మావయ్య మన దగ్గర వర్క్ చెయ్యాలని అడిగాడు. అందుకే ఒప్పుకున్నానని మాలిన చెప్తుంది. ఇప్పుడు పోటీ ఎలా అని దీప వాళ్ళు ఆలోచిస్తారు. మీకు పది నిమిషాలు టైమ్ ఇస్తున్నామని మాలిని అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ అందరిని తీసుకొని పక్కకి వస్తాడు. మరొకవైపు సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఒరేయ్ ఈ రోజు ఒక్క రోజు నాకు సపోర్ట్ గా ఉండమని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. నేను చెప్పినట్లు చెయ్యాలని జ్యోత్స్న అనగానే నీకు సపోర్ట్ చేస్తాను కానీ నువ్వు చెప్పినట్లు చెయ్యను.. నిన్ను సమర్థిస్తానని సూరజ్ అంటాడు.
ఆ తర్వాత అందరు టెన్షన్ పడుతారు. దీప నువ్వు అన్ని చూసుకోవాలి కదా అని పారిజాతం అంటుంది. అప్పుడే సూరజ్ , జ్యోత్స్న వస్తారు. మనకి ఇప్పుడు వేరే దారి లేదని అందరు అనుకుంటారు. ఉంది ఇప్పుడు పోటీలో జ్యోత్స్న వంట చేస్తుంది అని అనగానే అందరు షాక్ అవుతారు. జ్యోత్స్న కూడా షాక్ అవుతుంది. వీడేంటి నన్ను ఇరికించాడని జ్యోత్స్న అనుకుంటుంది. దానికి ఏం వంట రాదని అందరు అంటారు. మీకు నాపై నమ్మకం ఉంటే వెళ్లి పోటీకి సిద్ధం అని చెప్పండి అని సూరజ్ అంటాడు. అందరు వెళ్తారు. జ్యోత్స్న, పారిజాతం, సూరజ్ మాత్రమే ఉంటారు. కార్ బ్రేక్ తీసింది మీరే అని నాకు తెలుసని సూరజ్ అనగానే వాళ్ళు ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |